జనసేన యువ నాయకుడు సిద్దు జన్మదిన వేడుకలు కావలి పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ లో శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని కేక్ కట్ చేశారు. రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గారు పరిశీలించారు. రక్తదాతలను అభినందించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు.