పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 17-08-2025
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జలదంకి మండలం చోడవరం గ్రామానికి చెందిన గువ్వల శ్రీధర్ రెడ్డి - శ్రీ లక్ష్మీ దంపతుల కుమార్తె ఉదయశ్రీ వివాహ నలుగు కార్యక్రమం చోడవరం గ్రామంలో వారి నివాసం నందు ఆదివారం జరిగింది. ఈ నలుగు కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు..
జలదంకి మండలం చోడవరం గ్రామానికి చెందిన మర్రి రామారావు- నాగమణి దంపతుల కుమార్తె నాగలక్ష్మి వివాహ నలుగు కార్యక్రమం చోడవరం గ్రామంలోని వారి నివాసం నందు ఆదివారం జరిగింది. ఈ నలుగు కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు. జలదంకి మండలం బ్రాహ్మణక్రాక అగ్రహారం కు చెందిన గోపవరపు వెంకట కృష్ణయ్య- లీలావతి దంపతుల కుమార్తె మాధవి వివాహం బోగోలు మండలం ముంగమూరులో జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
బోగోలు మండలం ఏనుగుల బావికి చెందిన పంది సుబ్బారావు గౌడ్ - భారతీ దంపతుల కుమారుడు ఫణి కుమార్ గౌడ్ వివాహ నలుగు కార్యక్రమం ఏనుగుల బావిలో గ్రామంలో జరిగింది. ఈ వివాహ నలుగు కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వరుడిని ఆశీర్వదించారు.. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో 39 సంవత్సరాలు పైబడి సేవలందించి పదవీ విరమణ పొందిన చింతాల భాస్కర్ రావు ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు సత్కరించి, పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. కావలి పట్టణంలోని కలయిక కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.