కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 17-08-2025
కృష్ణాష్టమి సందర్భంగా కావలి పట్టణంలోని పాతూరులో బొంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకృష్ణుని గ్రామోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.. అనంతరం కావలి రూరల్ మండలం అల్లిగుంట పాలెం గ్రామంలో జరిగిన పోలేరమ్మ తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శనివారం రాత్రి పాల్గొన్నారు.. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నారు.