నిరుపేదలు లేని రాష్ట్రాన్ని నిర్మించడమే చంద్రన్న లక్ష్యం అధికారులను అభినందించిన..కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు..

 నిరుపేదలు లేని రాష్ట్రాన్ని నిర్మించడమే చంద్రన్న లక్ష్యం అధికారులను అభినందించిన..కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు..

నిరుపేదలు లేని రాష్ట్రాన్ని నిర్మించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం అని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు.శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎక్సైజ్ & ప్రొహిబిషన్ స్టేషన్ ఆధ్వర్యంలో  నిరుపేదలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా  8 కుటుంబాలను దత్తత తీసుకొని వారి జీవన ఉపాధి కోసం తోపుడు బండ్లను అందజేశారు.ఆ కుటుంబాలకు ఏమి అవసరం వచ్చిన అండగా ఉంటామని అన్నారు. కావలి నియోజకవర్గం లో దాతలు ముందుకు వచ్చి  పేదలను దత్తత తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి పరిచాలని ఎమ్మెల్యే కోరారు. ఇలాంటి మంచి పి4 పథకం ద్వారా బంగారు కుటుంబాలను ప్రభుత్వం, ప్రయివేట్, ప్రజలు ఆర్ధికంగా వెనుకబడిన వారిని దత్తతు తీసుకొని వారికీ విద్య, ఆరోగ్యం, ఆర్ధిక,జీవన ఉపాధికి సహకారం అందించేలా తీసుకురావడం  మంచి పరిణామం అన్నారు. దాతలు ముందుకు వచ్చి సహకారం అందిస్తే రాష్టంలో పేదవాడు ఉండరని తెలిపారు. 8 మందికి జీవన ఉపాధి కల్పించిన ఎక్సైజ్ సీఐ సుంకర శ్రీనివాసులు, ఎస్సైలు ప్రసన్న కుమార్, భాష వలి వారి సిబందిని ఎమ్మెల్యే అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య, బోగోలు మండలం టిడిపి అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరావు,టిడిపి యువ నాయకులు రావి విజయ్, బిట్రగుంట వెంకట్రావు,వల్లేరి కిరణ్ కుమార్..పి ఫోర్ సభ్యులు సత్యానంద్ వారి బృందం పాల్గొన్నారు..

google+

linkedin

Popular Posts