నూతన వధూవరులను ఆశీర్వదించిన..కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 16-11-2025

నూతన వధూవరులను ఆశీర్వదించిన..కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

చెంచులక్ష్మిపురం గ్రామంలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన అల్లూరు మండల పరిషత్ అధ్యక్షురాలు (MPP) శశిరేఖ వివాహ వేడుకలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. దర్శి గుంట వెంకయ్య, శ్రీమతి కస్తూరి గార్ల కుమార్తె అయిన శశిరేఖ వివాహం గ్రామ ప్రజలు, బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ దాంపత్య జీవితం సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను శుభాకాంక్షలు అందజేశారు..


google+

linkedin

Popular Posts