గోచిపాతల స్నేహలత ఆదరణ–స్తుతి కూడికలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు

 గోచిపాతల స్నేహలత ఆదరణ–స్తుతి కూడికలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు..

కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా నిలుస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే..

నెల్లూరు జిల్లా,బోగోలు ఐటీడీపీ అధ్యక్షుడు గోచిపాతల సందీప్ (సంజయ్) తల్లిగారు గోచిపాతల స్నేహలత గారు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూయడంతో బోగోలు మండలం, బేతనీయపేట గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఈరోజు నిర్వహించిన ఆదరణ–స్తుతి కూడిక కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా స్నేహలత గారి చిత్రపటానికి పూలమాల అర్పించి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు, బంధువులను పరామర్శిస్తూ వారి బాధను పంచుకున్నారు.“స్నేహలత గారి మరణం కుటుంబానికి తీరని లోటు. మీకు అవసరమైన ప్రతి విషయంలో పార్టీ, నేనూ అండగా ఉంటాం…” అని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ధైర్యం చెప్పారు.

google+

linkedin

Popular Posts