రియాన్షిక మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు..
కావలి పట్టణంలోని బృందావనం కళ్యాణ మండపంలో నేరెళ్ల వెంకట రవికుమార్, శ్రీమతి మమతా గార్ల మనవరాలు మస్తాన్ రియాన్షిక మొదటి సంవత్సర జన్మదిన వేడుకలు సోమవారం ఆనందోత్సాహాలతో నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై చిన్నారి పుట్టినరోజును ఘనంగా జరిపారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేకంగా విచ్చేసి చిన్నారి మస్తాన్ రియాన్షికను ఆశీర్వదించారు. చిన్నారికి ఆరోగ్యంగా, ఆనందంగా,ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గారికి ఆత్మీయ స్వాగతం పలికి తమ ఆనందాన్ని పంచుకున్నారు.









