తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో జీఓల అమలుపై సమీక్షా సమావేశం – పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో జీఓల అమలుపై సమీక్షా సమావేశం – పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..

తిరుపతి, జనవరి-20

తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో 

సబార్డినేట్ లెగిస్లాషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, మెడికల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన జీఓ ఎం.ఎస్ నెం.127, జీఓ ఎం.ఎస్ నెం.311 అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయా జీఓల అమలు స్థితిగతులు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య శాఖ పథకాల పురోగతిపై విస్తృతంగా చర్చించారు.ఈ సమీక్షా సమావేశానికి కావలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి గారు హాజరై పలు సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు,తోటి శాసనసభ్యులు,ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా జీఓల అమలును పటిష్టంగా చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.














google+

linkedin

Popular Posts