కావలిలో ‘కావలి కిడ్స్ ఫోటో పార్క్ స్టూడియో’ను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

 కావలిలో ‘కావలి కిడ్స్ ఫోటో పార్క్ స్టూడియో’ను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.. 

 కావలిలో ఫోటో పార్క్ స్టూడియో ఓపెనింగ్ లో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ సందడి…

 కావలి ఫిబ్రవరి-01

నెల్లూరు జిల్లా కావలి పట్టణం  రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన ‘కావలి కిడ్స్ ఫోటో పార్క్ స్టూడియో ను ఆదివారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు స్టూడియో నిర్వాహకులు ఓంకార్ – మాధురి దంపతులు మేళతారాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి స్టూడియోను అధికారికంగా ప్రారంభించారు.ప్రారంభోత్సవం అనంతరం స్టూడియోను పరిశీలించిన ఎమ్మెల్యే, నూతన వధూవరులు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు ప్రత్యేకంగా రూపొందించిన టాయ్స్, డ్రెస్సు లొకేషన్స్, ఫోటో సెట్స్ ఎంతో ఆహ్లాదకరంగా, అద్భుతంగా ఉన్నాయనిప్రశంసించారు.ఇలాంటి ఫోటో పార్క్ స్టూడియో కావలిలో ప్రారంభం కావడం ప్రజలకు ఒక సువర్ణ అవకాశం అని పేర్కొన్న ఎమ్మెల్యే, కావలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ రీతు చౌదరి, డెమోన్ పవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, తమ సందడి కార్యక్రమాలతో హాజరైన వారిని అలరించారు. ఈ కార్యక్రమం కావలి పట్టణంలో సందడిగా సాగింది.

google+

linkedin

Popular Posts