పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 25-03-2026

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 25-03-2026

కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామానికి చెందిన కాటంగారి జయరాం - పోలమ్మ దంపతుల కుమారుడు హరిప్రసాద్ వివాహం తుమ్మలపెంటలోని వారి నివాసంలో బుధవారం జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. కావలి పట్టణ జనసేన అధ్యక్షుడు, ఏరియా వైద్యశాల డైరెక్టర్ పొబ్బా సాయి విఠల్ తండ్రి పొబ్బా చలపతి రావు గారి ఉత్తరక్రియల కార్యక్రమం కావలి పట్టణంలోని వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొని చలపతిరావు చిత్రపటానికి నివాళులర్పించారు.

వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బోగోలు మండలం కొండ బిట్రగుంట గ్రామానికి చెందిన రావి రంగయ్య తండ్రి రావి పెంచలయ్య గారి ఉత్తరక్రియల కార్యక్రమం బుధవారం వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొని పెంచలయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కోవూరు మండలం పడుగుపాడు గ్రామానికి చెందిన మేడా విష్ణు వర్ధన్ రెడ్డి గారి ఉత్తరక్రియల కార్యక్రమం పడుగుపాడు లోని వారి నివాసంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొని విష్ణువర్ధన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కావలి ఎలక్ట్రికల్ ఏడిఈ అన్నపురెడ్డి రవికుమార్ తండ్రి అన్నపురెడ్డి రత్నారెడ్డి గారి ఉత్తరక్రియల కార్యక్రమం వింజమూరు మండలం నల్లకొండ గ్రామంలో వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొని రత్నారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


google+

linkedin

Popular Posts