కావలిలో ఘనంగా ఎన్టీఆర్ 103 జయంతి వేడుకలు

 కావలిలో ఘనంగా ఎన్టీఆర్ 103 జయంతి వేడుకలు

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన..ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

కావలి: గురువారం:28

తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి సందర్భంగా కావలి పట్టణంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.కార్యక్రమంలో కావలి నియోజకవర్గ పరిశీలకులు జయంతి బాబు, టిడిపి పట్టణ కమిటీ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే టిడిపి జెండాను ఆవిష్కరించారు.

కార్యక్రమ ప్రాంగణం మొత్తం పసుపు జెండాలు, ఎన్టీఆర్ చిత్రాలతో కళకళలాడింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని కొనియాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించి సామాన్య ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు.పేదల సంక్షేమం, మహిళల గౌరవం, రైతుల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని ఎమ్మెల్యే గుర్తుచేశారు.

రెండు రూపాయల కిలో బియ్యం పథకం, మహిళలకు ఆస్తి హక్కులు, పేదల సంక్షేమ కార్యక్రమాలు వంటి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలతో ఎన్టీఆర్ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.ఎన్టీఆర్ ఆశయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని, మంత్రి నారా లోకేష్ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి టిడిపి కార్యకర్త ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

“ఎన్టీఆర్ కేవలం ఒక నాయకుడు కాదు.. తెలుగు వారి గౌరవానికి ప్రతీక. ఆయన చూపిన మార్గంలోనే తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుంది” అని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు.ఈ

కార్యక్రమంలో పట్టణ కమిటీ,టిడిపి నాయకులు, మహిళా నాయకులు,యువత, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు..



google+

linkedin

Popular Posts