జవహర్ భారతి డిగ్రీ కళాశాలలో ఘనంగా డా. పి. సుబ్రమణ్యం నాయుడు ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం
సుబ్రహ్మణ్యం నాయుడుని సన్మానించి అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి..
కావలి, జూలై 31:
కావలి పట్టణంలోని జవహర్ భారతి డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ అధ్యాపకుడిగా విశిష్ట సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన డా. పి. సుబ్రహ్మణ్యం నాయుడుని జవహర్ భారతి అధ్యాపక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు..పలువురు విద్యావేత్తలు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, ప్రముఖులు హాజరై డా. సుబ్రహ్మణ్యం నాయుడు విద్యారంగానికి అందించిన సేవలను కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం సుబ్రహ్మణ్యం చేసిన కృషి, క్రమశిక్షణ, అంకితభావం ఆదర్శప్రాయమని కొనియాడుతూ ఘన సన్మానం నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యా రంగంలో సుబ్రహ్మణ్యం అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ, ఉద్యోగ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో, విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించాలని ఆకాంక్షించారు.
డా. సుబ్రహ్మణ్యం నాయుడు వంటి అధ్యాపకులు ఎందరో విద్యార్థులను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లారని కొనియాడారు. ఆరోగ్యంగా, ఆనందంగా దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జవహర్ భారతి డిగ్రీ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని డా. సుబ్రమణ్యం నాయుడు గారికి ఘనంగా అభినందనలు తెలియజేశారు.