ఎన్3 రిపోర్టర్ రసూల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
కావలి,జూలై:31
కావలి పట్టణానికి చెందిన ఎన్3 రిపోర్టర్ రసూల్ తల్లి సయ్యద్ మౌలాబీ ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం రసూల్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా సయ్యద్ మౌలాబీకి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం రసూల్‌తో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి దుఃఖంలో తాను భాగస్వామినని పేర్కొన్నారు. దివంగత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.