నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
కావలి: ఆదివారం,16
కావలి పట్టణంలోని బృందావనం కళ్యాణ మండపంలో ఆదివారం వైభవంగా జరిగిన వివాహ వేడుకకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కనమర్లపూడి శ్రీధర్ రావు - నాగమణి దంపతుల కుమార్తె డాక్టర్ వైష్ణవి వివాహ మహోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే, నూతన వధూవరులను కలసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం అక్షతలు వేసి కొత్త దంపతులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పెళ్లికుమార్తె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రముఖులు మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు..