అల్లూరులో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రజా దర్బార్.. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు..
భారీగా తరలివచ్చిన ప్రజలు.. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ.. ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపు
కావలి / అల్లూరు, ఆగస్టు 1
కావలి నియోజకవర్గంలోని అల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అల్లూరు మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, అభివృద్ధి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.ప్రజలు సమర్పించిన ప్రతి అర్జీని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి, సమస్యల తీవ్రతను తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తూ, పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.అర్జీదారులతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎంతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, తనను నమ్ముకుని వచ్చిన ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల విశ్వాసమే తనకు బలం అని, వారి ఆశలను నెరవేర్చడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు."అల్లూరు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను"
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ అల్లూరు మండల ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు. ఏ సమస్య వచ్చినా ప్రజలు నేరుగా తనను సంప్రదించవచ్చని, సమస్య పరిష్కారం వరకు తన వంతు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా పనిచేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
SIR కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు
SIR కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు చూపుతున్న చొరవ అభినందనీయమని కొనియాడారు.కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేపడుతున్న ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ప్రజలతో నిరంతరం మమేకమై వారి అవసరాలను గుర్తించి పరిష్కరించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో గత రెండు సంవత్సరాల్లో కావలి నియోజకవర్గం, ముఖ్యంగా అల్లూరు మండలంలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు.ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని, ప్రజలకు అవసరమైన ప్రతి మౌలిక సదుపాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఇంటింటి ప్రచారంలో స్వయంగా పాల్గొంటాను ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తాను కూడా ప్రత్యక్షంగా పాల్గొంటానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టే విధంగా కార్యాచరణ కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, భారీగా పాల్గొన్నారు..