అల్లూరు అల్లుడికి బ్రహ్మరథం పట్టిన అల్లూరు ప్రజలు. 06-08-2026

 అల్లూరు అల్లుడికి బ్రహ్మరథం పట్టిన అల్లూరు ప్రజలు..

అభివృద్ధి పనులతో దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

రూ.3.23 కోట్లతో ఇందుపూరు–పురిణి బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన.

రూ.2.60 కోట్లతో పురిణి–అల్లూరు బీటీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం.

వెస్ట్ గోగులపల్లిలో రూ.25 లక్షల సీసీ రోడ్లు ప్రారంభం.

రూ.30 లక్షల సైడ్ డ్రైన్లను ప్రజలకు అంకితం.

గ్రామాల్లో ఎమ్మెల్యేకు గజమాలతో ఘన స్వాగతం.. అభివృద్ధి పనులపై ప్రజల్లో హర్షం.

బుధవారం, ఆగస్టు:06

అల్లూరు మండలంలో అభివృద్ధి పనులకు వరుసగా శ్రీకారం చుడుతూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. గ్రామాల వారీగా రోడ్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. బుధవారం అల్లూరు మండలం పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి  పర్యటన సందర్భంగా ప్రతి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలకగా, ప్రజలు బ్రహ్మరథం పట్టారు.ఇందుపూరు–పురిణి గ్రామం వరకు, వయా పురిణి కొత్తపాలెం మీదుగా రూ.3.23 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్డు కల నెరవేరుతోందని ఆనందం వ్యక్తం చేశారు. రోడ్డు పూర్తయితే రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు రైతులు, విద్యార్థులు, అత్యవసర సేవలకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.ఇందుపూరు గ్రామ సభలో స్థానిక ప్రజల సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా తెలుసుకున్నారు. గ్రామానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు."ఇందుపూరు గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటాను" అని ఎమ్మెల్యే స్పష్టం చేయగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.అనంతరం పురిణి గ్రామంలో రాజుపాలెం–ఇస్కపల్లి రోడ్ నుంచి అల్లూరు వరకు రూ.2.60 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రోడ్డు పనులు ఇప్పుడు ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. గ్రామస్తులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

వెస్ట్ గోగులపల్లి గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే, రూ.30 లక్షలతో నిర్మించిన సైడ్ డ్రైన్లను ప్రజలకు అంకితం చేశారు. గ్రామంలో పూలవర్షం, గజమాలలతో ఎమ్మెల్యేకు అపూర్వ స్వాగతం లభించింది. గ్రామం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అల్లూరు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తూ ప్రతి గ్రామానికి మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.అల్లూరు మండలంలోని ప్రతి గ్రామానికి మెరుగైన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ వంటి ప్రాథమిక అవసరాలను అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సహకారం, ప్రభుత్వ మద్దతుతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు..అల్లూరు ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తాం. ప్రజల విశ్వాసమే మా బలం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం. అభివృద్ధిలో రాజకీయాలకు తావు లేదు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే మా లక్ష్యం.

అల్లూరును ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తాం. ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అల్లూరుకు కొత్త గుర్తింపు తీసుకొస్తాం."ఈ కార్యక్రమంలో అధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు..

google+

linkedin

Popular Posts