అల్లూరులో జెట్టి ఆదిశేషారెడ్డి పెద్దకర్మకు హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శ

అల్లూరులో జెట్టి ఆదిశేషారెడ్డి పెద్దకర్మకు హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శ

అల్లూరు, ఆగస్టు 1:

అల్లూరు గ్రామానికి చెందిన జెట్టి ఆదిశేషారెడ్డి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన పెద్దకర్మ కార్యక్రమం శనివారం అల్లూరులోని వారి స్వగృహంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరై జెట్టి ఆదిశేషారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆదిశేషారెడ్డి మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జెట్టి ఆదిశేషారెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.


google+

linkedin

Popular Posts