రూ. 1.32 కోట్లతో కావలిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా, జెసి వెంకటేశ్వర్లు.
బుడంగుంట జంక్షన్ నుండి కరెంట్ ఆఫీస్ సెంటర్ వరకు రూ. 57 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభం.
ముసునూరు మందాటి చెరువు వద్ద రూ. 75 లక్షలతో నిర్మించిన 'తెలుగు తల్లి పార్కు' కావలి ప్రజలకు అంకితం.
కావలిలో జర్నలిస్టుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించనున్న 'మీడియా భవన్' కు శంకుస్థాపన చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే.
కావలి నియోజకవర్గాభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే పనితీరును ప్రశంసించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా.
మందాటి చెరువు వద్ద 1.1 కి.మీ వాకింగ్ ట్రాక్, ప్లే గ్రౌండ్, ఓపెన్ జిమ్ అందుబాటులోకి తెచ్చామని, భద్రతకు సీసీ కెమెరాలు, పోలీస్ అవుట్‌పోస్ట్ ఏర్పాటు చేస్తామని తెలిపిన ఎమ్మెల్యే..
కావలి నుంచి తుమ్మలపెంట బీచ్ వరకు సోలార్ లైట్లు మంజూరు..
కావలిలో మీడియా భవన్ కు ఇద్దరు కలెక్టర్లు శంకుస్థాపన చేయడం జర్నలిస్టుల అదృష్టం..
జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా సహాయాలను కొనియాడిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..
కావలి, ఆదివారం :16
కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రూ. 1.32 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు నూతన ప్రాజెక్టులను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మరియు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలసి ఘనంగా ప్రారంభించారు. కావలి పట్టణ ప్రజలు, అధికారులు భారీ సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు..బుడంగుంట జంక్షన్ నుండి కరెంట్ ఆఫీస్ సెంటర్ వరకు రూ. 57 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు.
కావలి మందాటి చెరువు వద్ద రూ. 75 లక్షలతో సుందరీకరించిన 'తెలుగు తల్లి పార్కు'ను ఎమ్మెల్యే ప్రజల వినియోగం కోసం అంకితం చేశారు. జర్నలిస్టుల సౌకర్యార్థం కావలిలో నూతనంగా నిర్మించనున్న 'మీడియా భవన్' నిర్మాణానికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మరియు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కలసి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.ఇ
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం సులువుగా రాలేదని, కావలిలో ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండాను చూసిన ప్రతిసారీ యువతలో దేశభక్తి పురివిప్పాలని సూచించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పనితీరును ప్రశంసిస్తూ, 25 ఏళ్ల వయస్సులోనే ఒక సాధారణ ఉద్యోగం నుండి నేడు శాసనసభ్యుని స్థాయికి ఎదిగారని కొనియాడారు. నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గాభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాల కల్పన పైనే ఎమ్మెల్యే నిరంతరం శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. త్వరలోనే కావలి ప్రాంతంలో పలు నూతన పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు.
ఆహ్లాదకరమైన, సురక్షితమైన కావలి మన లక్ష్యం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ కుటుంబ సమేతంగా సమయం గడిపేలా మందాటి చెరువు వద్ద 1.1 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, చిన్నారుల కోసం ప్లే గ్రౌండ్, ఓపెన్ జిమ్ అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ప్రజల భద్రత కోసం సిసి కెమెరాలు, పోలీస్ అవుట్‌పోస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పాపిరెడ్డి చెరువు వద్ద సెంటర్ లైటింగ్ వాకింగ్ ట్రాక్ తో పాటు 'తెలుగు తల్లి' విగ్రహాన్ని కూడా ప్రతిష్టిస్తామని వెల్లడించారు. కావలి ప్రాంత అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్న కలెక్టర్ హిమాన్షు శుక్లాకు, ఆయన వంటి సమర్థుడైన అధికారిని నెల్లూరు జిల్లాకు పంపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కావలి నుండి తుమ్మలపెంట బీచ్ వరకు సోలార్ లైట్లు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు,భారీగా పాల్గొన్నారు.