బిరంగుంటలో శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

బిరంగుంటలో శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

అల్లూరు, ఆగస్టు: 5

అల్లూరు మండలం బిరంగుంట గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి 10వ వార్షికోత్సవ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా  పాల్గొన్నారు

కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బిరంగుంట గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, కావలి నియోజకవర్గ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం కలగాలని శ్రీ పోలేరమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలతో నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts