చెంచులక్ష్మీపురంలో పావని సూపర్ మార్కెట్ ప్రారంభించిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి

చెంచులక్ష్మీపురంలో పావని సూపర్ మార్కెట్ ప్రారంభించిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి

కావలి, ఆగస్టు 3:

బోగోలు మండలం చెంచులక్ష్మీపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పావని సూపర్ మార్కెట్ను కావలి శాసన సభ్యులు  దగుమాటి వెంకట కృష్ణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు సూపర్ మార్కెట్ అధినేత బోగిరి ప్రభాకర్, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు మరియు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సూపర్ మార్కెట్‌ను పరిశీలించి అందుబాటులో ఉంచిన వస్తువులు, వినియోగదారులకు కల్పించిన సౌకర్యాలను తెలుసుకున్నారు.గ్రామ ప్రజలకు నాణ్యమైన వస్తువులు ఒకేచోట అందించేలా సూపర్ మార్కెట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు గ్రామ అభివృద్ధికి ఇటువంటి వ్యాపార సంస్థలు దోహదపడతాయని అన్నారు.

ఈ సందర్భంగా సూపర్ మార్కెట్ అధినేత బోగిరి ప్రభాకర్ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందిస్తూ, వ్యాపారంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


google+

linkedin

Popular Posts