కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై ఇంటింటా ప్రచారం – కోవూరుపల్లిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై ఇంటింటా ప్రచారం – కోవూరుపల్లిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి

 గురువారం,ఆగస్టు :06

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బోగోలు మండలం కోవూరుపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు, కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, కోవూరుపల్లి గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామంలో ఈరోజు   రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. అలాగే విద్యుత్ సౌకర్యాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకొని, గ్రామ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు.

ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని, ప్రజల సహకారంతో కోవూరుపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో బోగోలు మండల పార్టీ అధ్యక్షులు మాలపాటి నాగేశ్వరరావు, నాగులవరం సింగల్ విండో అధ్యక్షులు చిలకపాటి వెంకటేశ్వర్లు, క్లస్టర్ ఇంచార్జ్ రామ్మోహన్ రెడ్డి, కోవూరు పల్లి  సీనియర్ నాయకులు శీనయ్య, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి లేల్లపల్లి సుధీర్ బాబు, జిల్లా కార్యదర్శి కోడూరు వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts