గుంటుపల్లి వెంకటేశ్వర చౌదరి కుటుంబానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరామర్శ
కావలి, ఆదివారం:16
సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యులు, నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మరియు ద్వారకా లాడ్జ్ యజమాని గుంటుపల్లి వెంకటేశ్వర చౌదరి శుక్రవారం సాయంత్రం పరమపదించిన సంగతి విదితమే. శనివారం నాటి ఆయన అంతిమ యాత్రలో నేరుగా పాల్గొని అశ్రునయనాల మధ్య నివాళులర్పించిన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి, ఆదివారం కావలి పట్టణంలోని వారి నివాసానికి వెళ్లారు.వెంకటేశ్వర చౌదరి కుమారుడు రాజకుమార్ చౌదరితో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే నేరుగా పరామర్శించారు. ఈ సందర్భంగా వారిని ఓదారుస్తూ, వెంకటేశ్వర చౌదరి గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని, ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ,ప్రార్థించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.