ఆర్యవైశ్య భవన్ నిర్మాణానికి మరో ముందడుగు.. స్థలాన్ని పరిశీలించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

ఆర్యవైశ్య భవన్ నిర్మాణానికి మరో ముందడుగు.. స్థలాన్ని పరిశీలించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

కావలి, జూలై 31: 

కావలి పట్టణంలోని ఆర్యవైశ్య సమాజానికి శాశ్వత ఆస్తిగా నిలిచే ఆర్యవైశ్య భవన్ నిర్మాణానికి మరో కీలక ముందడుగు పడింది. కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు, సభ్యులు భవన నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని కోరగా, ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా భవనం నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై సంఘ నాయకులతో ఎమ్మెల్యే చర్చించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవన నిర్మాణం చేపట్టాలని, విశాలమైన సమావేశ మందిరం, పార్కింగ్ సౌకర్యం, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు అనువుగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సమాజానికి ఎన్నో దశాబ్దాల పాటు ఉపయోగపడేలా నాణ్యమైన నిర్మాణం చేపట్టాలని సంఘ ప్రతినిధులకు సూచనలు చేశారు.

అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ఆర్యవైశ్య భవన్ నిర్మాణానికి అవసరమైన అన్ని విధాలుగా తన మద్దతు అందిస్తానని హామీ ఇచ్చారు. సమాజ ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి మంచి కార్యక్రమానికి తాను అండగా ఉంటానని, ఈ భవనం నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించి స్థలాన్ని స్వయంగా పరిశీలించడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ఇచ్చిన భరోసాతో భవన నిర్మాణం త్వరలోనే ప్రారంభమై పూర్తి అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, పెద్దలు, యువ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు, మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని భవన నిర్మాణానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

google+

linkedin

Popular Posts