కావలిలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు,పార్టీ నాయకులతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమీక్ష సమావేశం.

కావలిలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు,పార్టీ నాయకులతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమీక్ష సమావేశం.

కావలి 40వ వార్డులో రూ.200 కోట్లతో భారీ అభివృద్ధి పనులకు త్వరలో శ్రీకారం.

SIR కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే ధన్యవాదాలు... 

ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపు.

ప్రతి పేదవాడి సమస్య తెలుసుకోండి... వారి సమస్య పరిష్కరించే బాధ్యత మనం తీసుకోవాలి..

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో కావలి అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది... 

కావలిని కనకపట్నంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయమని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు..

కావలి, జూలై 31: 

కావలి పట్టణ అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, రానున్న అభివృద్ధి పనులు, పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారులు,పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కావలి పట్టణం 40వ వార్డులో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో త్వరలో భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని, రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.ఇటీవల నిర్వహించిన SIR కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు, నాయకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అదే ఉత్సాహంతో 'ఇంటింటికి ప్రచారం' కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండాలని, ప్రతి పేద కుటుంబం వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, "ప్రతి పేదవాడి సమస్యను తెలుసుకోండి... వారి సమస్యను తీర్చే బాధ్యత నాది" అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో వేగంగా దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వందల కోట్ల రూపాయలతో పట్టణాభివృద్ధికి శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.కావలిని రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొంటూ, "కావలిని కనకపట్నంగా తీర్చిదిద్దడం నా ధ్యేయం" అని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు.ఈ, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts