కావలిలో ఇస్కాన్ మందిరం నిర్మాణానికి వినతి.. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

కావలిలో ఇస్కాన్ మందిరం నిర్మాణానికి వినతి.. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

గురువారం,ఆగస్టు:06

కావలి పట్టణంలో ఇస్కాన్ (ISKCON) మందిరం నిర్మాణానికి సంబంధించి నెల్లూరు ఇస్కాన్ ప్రతినిధులు గురువారం కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కావలి పట్టణంలో ఇస్కాన్ మందిరం నిర్మాణం కోసం ప్రభుత్వం తరఫున తగిన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందజేశారు.వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ప్రతినిధుల అభ్యర్థనను శ్రద్ధగా ఆలకించారు.ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, నిబంధనల మేరకు అవసరమైన సహకారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కావలిలో ఇస్కాన్ మందిరం ఏర్పాటుకు ఎమ్మెల్యే అందిస్తున్న సహకారం ఎంతో ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు ఇస్కాన్ అధ్యక్షులు డాక్టర్ సుకదేవ స్వామి, కావలి ఇస్కాన్ టెంపుల్ ఇన్‌చార్జి చంద్రశేఖర్ ప్రభు, హరే కృష్ణ భక్తులు, కావలి రథయాత్ర కన్వీనర్లు డాక్టర్ కె. మాధవ రెడ్డి, ఆర్టీఎన్ ఏ. రమేష్ రెడ్డి, ఆర్టీఎన్ ఎన్. రవి కుమార్, ఆర్టీఎన్ బి. వీరస్వామి, ఆర్టీఎన్ కె. కృష్ణారెడ్డి, ఆర్టీఎన్ జి. సురేష్ రెడ్డి, రొటరీ క్లబ్ ఆఫ్ కావలి అధ్యక్షులు ఆర్టీఎన్ ఎం. నరసింహం, అలాగే రథయాత్ర పోషకులు, ఇస్కాన్ జీవిత సభ్యులు (లైఫ్ మెంబర్స్) తదితరులు పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts