కావలిలో ఘనంగా కలుగోళ శాంభవి అమ్మవారి సారె కార్యక్రమం.. పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

 కావలిలో ఘనంగా కలుగోళ శాంభవి అమ్మవారి సారె కార్యక్రమం.. పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

కావలి, ఆగస్టు 2: 

కావలి పట్టణంలోని పాతూరు పోలేరమ్మ తల్లి దేవస్థానం వద్ద నుంచి కావలి గ్రామ దేవత  కలుగోళ శాంభవి అమ్మవారి ఆలయం వరకు పాతూరు కాపుల ఆధ్వర్యంలో ఆషాడ మాసంలో నిర్వహించిన సాంప్రదాయ సారె కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొని పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కావలి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులు పంటలతో సుభిక్షంగా ఉండాలని, యువతకు మంచి అవకాశాలు లభించాలని, ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని కూడా ఆకాంక్షించారు.అనంతరం పోలేరమ్మ దేవస్థానం నుంచి కలుగోళ శాంభవి అమ్మవారి దేవస్థానం వరకు నిర్వహించిన భారీ ఊరేగింపులో ఎమ్మెల్యే భక్తులతో కలిసి పాల్గొన్నారు. సంప్రదాయ వాద్యాలు, మేళతాళాలు, డప్పు కళాకారుల విన్యాసాలు, భక్తుల జైజైధ్వానాలతో ఊరేగింపు  ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. మహిళలు అమ్మవారికి సారె సమర్పిస్తూ భక్తిశ్రద్ధలతో పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.పాతూరు కాపుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమ్మవారి భక్తులు, మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని భక్తి భావాన్ని చాటుకున్నారు. ఊరేగింపు  మార్గమంతా భక్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పాతూరు కాపులు,తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

google+

linkedin

Popular Posts