పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
గురువారం,ఆగస్టు:06
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గురువారం పలు సామాజిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పలువురిని పరామర్శించారు.ముందుగా దగదర్తి గ్రామంలో ఇటీవల మృతి చెందిన తాళ్లూరి వెంకటేశ్వర్లు నాయుడు నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ధైర్యం చెప్పారు.అదే గ్రామంలో ఆంధ్రప్రభ రిపోర్టర్ మల్లికార్జున తల్లి అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుసుకున్న ఎమ్మెల్యే, వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులతో మాట్లాడారు.అనంతరం బోగోలు మండలం కోవూరుపల్లి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నాటకరాని పోలయ్య ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుసుకుని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తదుపరి అదే గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇందుపూరు భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, ఆయనను ఆప్యాయంగా పలకరించి పార్టీ కార్యకలాపాలు, స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు.ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..