కావలి అభివృద్ధిలో మరో మైలురాయి..అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టి

కావలి అభివృద్ధిలో మరో మైలురాయి..అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి  ప్రత్యేక దృష్టి

కావలి రూపురేఖలు మార్చే అభివృద్ధి కార్యక్రమాలు..

రూ.45 లక్షల నిధులతో పాత శివాలయం–పోలేరమ్మ గుడి వరకు సిమెంట్ రోడ్డు, డ్రెయిన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి...

నాణ్యతలో రాజీ లేకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే ఆదేశం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశీస్సులతో కావలి పట్టణంలో  రూ.200 కోట్లతో కావలి సమగ్ర అభివృద్ధికి శ్రీకారం – ఎమ్మెల్యే

పాతూరు నుంచి కొత్త సత్రం క్రాస్ రోడ్డు వరకు రూ.11 కోట్లతో రహదారి నిర్మాణ పనులు ప్రారంభం..

ఆగస్టు 15న మందాటి చెరువు మినీ ట్యాంక్ బండ్, బుడంగుంట–కరెంట్ ఆఫీస్ డివైడర్ వరకు ఆధునిక లైటింగ్ ప్రారంభం.. 

కావలిని 'కనకపట్నం'గా తీర్చిదిద్దడమే లక్ష్యం – ఎమ్మెల్యే

కావలి, జూలై 31: 

కావలి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా వరుసగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు.కావలి పట్టణంలోని పాత శివాలయం నుంచి పోలేరమ్మ గుడి వరకు ఎంపీల్యాడ్స్ (MPLADS) నిధులు రూ.45 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సంబంధిత అధికారులు, పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి రాజీ పడకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనులను చేపట్టాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్‌కు స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, మార్గదర్శకత్వంలో కావలి పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు త్వరలో సుమారు పట్టణంలోని  రూ.200 కోట్లతో భారీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కావలి పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.అదేవిధంగా పాతూరు నుంచి కొత్త సత్రం క్రాస్ రోడ్డు వరకు రూ.11 కోట్ల వ్యయంతో ఆధునిక రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ వెలుగులు, తాగునీరు, పారిశుధ్యం వంటి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేపడుతున్నామని చెప్పారు.

ఆగస్టు 15వ తేదీన కావలి ప్రజలకు మరో అభివృద్ధి కానుకగా మందాటి చెరువు మినీ ట్యాంక్ బండ్ పాటు బుడంగుంట నుంచి కరెంట్ ఆఫీస్ డివైడర్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక ఎల్ఈడి లైటింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.రానున్న రోజుల్లో కావలి పట్టణం రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని, ప్రతి వార్డు అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. "కావలిని కనకపట్నంగా తీర్చిదిద్దడమే మా సంకల్పం. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రతి అభివృద్ధి పనిని వేగవంతం చేస్తున్నాం.నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ప్రజల సహకారంతో కావలిని రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా నిలబెడతాం" అని ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు..


google+

linkedin

Popular Posts