అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మునగనూరు తిరుపాలును పరామర్శించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
కావలి, ఆగస్టు 2:
కావలి పట్టణంలోని బృందావనం కాలనీలో నివాసముంటున్న మునగనూరు తిరుపాలు అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆయనను స్వయంగా పరామర్శించారు.
ఈ సందర్భంగా తిరుపాలుతో ఆప్యాయంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవనానికి రావాలని ఆకాంక్షించారు. అవసరమైన వైద్య సహాయం అందేలా తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.ఎమ్మెల్యే పరామర్శకు తిరుపాలు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, బిట్రగుంట దేవస్థానం చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి, కావలి ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు చవలా రామకృష్ణ,వల్లేరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.