సాంబశివపురంలో ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వ విజయాలను వివరించిన ఎమ్మెల్యే

సాంబశివపురంలో ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వ విజయాలను వివరించిన ఎమ్మెల్యే

 బుధవారం, ఆగస్టు:06 

నెల్లూరు జిల్లా బోగోలు మండలం మంగమూరు పంచాయతీ పరిధిలోని సాంబశివపురం గ్రామంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జిలతో కలిసి గ్రామంలోని ప్రతి వీధిలో పర్యటిస్తూ ప్రజలను నేరుగా కలిసి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్రచార కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన 45 రోజుల ఇంటింటి ప్రచార కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేసిన ప్రతి అభివృద్ధి పనిని, ప్రజలకు అందించిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి ఇంటి గడపకు చేరవేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వేగంగా దూసుకెళ్తోందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలాలు, సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో త్వరలోనే శుభవార్త అందుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులెవ్వరూ ప్రభుత్వ పథకాలకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.సాంబశివపురం గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటామని, గ్రామంలో రహదారులు, మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, ఇతర అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జిలు, కూటమి శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి తమ సమస్యలను వివరించగా, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

google+

linkedin

Popular Posts