సాంబశివపురానికి మహర్దశ... జాతీయ రహదారి నుంచి గ్రామం వరకు రూ.1.43 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
బోగోలు మండలం సాంబశివపురం, ఆగస్టు :06
ఎన్నో సంవత్సరాలుగా కనీస రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న నెల్లూరు జిల్లా బోగోలు మండలం మంగమూరు పంచాయతీ పరిధిలోని సాంబశివపురం గ్రామానికి అభివృద్ధి రోజులు ప్రారంభమయ్యాయి. గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల కలను సాకారం చేస్తూ కలకత్తా–చెన్నై జాతీయ రహదారి నుంచి సాంబశివపురం గ్రామం వరకు రూ.1.43 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు..పూల వర్షంతో సాదరంగా ఆహ్వానించి గ్రామమంతా ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కొన్ని గ్రామాలకు కనీస రహదారి సౌకర్యం కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు చేరుకోవాలన్నా, రైతులు పంటలను మార్కెట్‌కు తరలించాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి రోడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.సాంబశివపురం గ్రామంలో రహదారితో పాటు విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలను కూడా దశలవారీగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు తనపై చూపించిన ప్రేమ, అభిమానానికి రుణపడి ఉంటానని, సాంబశివపురాన్ని అన్ని విధాలుగా ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేసి చూపిస్తానని స్పష్టం చేశారు.గ్రామ ప్రజల ప్రత్యేక విజ్ఞప్తిని స్వీకరిస్తూ, తన సొంత నిధులతో గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ ప్రకటనతో గ్రామస్తులు హర్షధ్వానాలు చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయిన అనంతరం గ్రామ ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, విద్యార్థుల ప్రయాణం, అత్యవసర సేవలు మరింత సులభతరం కానున్నాయి. గ్రామాభివృద్ధికి ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడ్డారు..
ఈ కార్యక్రమంలోబోగోల మండలు ఎమ్మార్వో సానా శ్రీనివాసులు రెడ్డి బోగోలు ఎంపీడీవో సుబ్రమణ్యం ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులు, ఇంజనీర్లు, బోగోలు మండలం టిడిపి అధ్యక్షుడు మాలేపాటి నాగేశ్వరరావు, నాగులవరం పిఎసిఎస్ చైర్మన్ చిలకపాటి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేల్లపల్లి సుధీర్, ఎన్నాబత్తిన వెంకటేశ్వర్లు,చింతం బాబుల్ రెడ్డి, సరే శ్రీనివాసులు రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సరే జయశ్రీ, గోచిపాతల సంజయ్, సయ్యద్ సుభాని, గ్రామస్తులు, తదితరులు భారీగా పాల్గొన్నారు.