రోడ్డు ప్రమాదంలో గాయపడిన టిడిపి నాయకుడు తిరుపతయ్యను పరామర్శించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
కావలి: ఆదివారం,16
తుమ్మలపెంట పంచాయతీ రాముడు పల్లిపాలేనికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అప్పాడి తిరుపతి వెంకయ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కావలి పట్టణంలోని కందుకూరి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదివారం ఆసుపత్రికి వెళ్లి తిరుపతి వెంకయ్యను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం తిరుపతయ్యతో మాట్లాడి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు"తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటుంది. తిరుపతయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. పార్టీ తరఫున అన్ని విధాలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం" అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండలం అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.