పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 20-08-2024

 పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 

బోగోలు మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు బుధవారం పాల్గొన్నారు..

బోగోలు మండలం విశ్వనాధరావుపేట లో లిటిల్ విలేజ్ మల్టీ క్యుసైన్ రెస్టారెంట్ అండ్ కేఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు..  కస్టమర్ల అభిమానం చూరగొనాలని రెస్టారెంట్ యాజమాన్యం కు తెలియజేశారు..

బోగోలు మండలం సుందరగిరి వారి కండ్రిక లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు.. ఆలయంలో జరగనున్న శిల ప్రతిష్టకు సంబందించిన పనులను పరిశీలించారు.. స్వామి వారిని దర్శించుకున్నారు..

 బోగోలు మండలం నాగులవరం గ్రామానికి చెందిన  తెలుగుదేశం పార్టీ నాయకులు కాండ్ర రఘురామ నాయుడు తల్లి కాండ్ర రాఘమ్మ పెద్ద కర్మ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బోగోలు మండల టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సుధీర్, స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

google+

linkedin