పేదల ఆకలి తెలిసిన వ్యక్తి చంద్రబాబు
- అన్నక్యాంటీన్లు పేదవారి సొత్తు
- గత వైసిపి ప్రభుత్వం పేదలకు పట్టెడన్నం పెట్టలేకపోవడం దుర్మార్గం
- ముఖ్యమంత్రి తొలి ఐదు సంతకాల్లో అన్న క్యాంటిన్ ఒకటి
- అన్న క్యాంటిన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి వెల్లడి
పేదల ఆకలి తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, అందుకే అన్న క్యాంటిన్ ల ద్వారా కేవలం 5 రూపాయలకే భోజనం అందిస్తున్నారని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి (కావ్య క్రిష్ణారెడ్డి) తెలిపారు.. శుక్రవారం కావలి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అన్న క్యాంటిన్ ను ఆయన ప్రారంభించారు.. పేదలకు స్వయంగా వడ్డించి, తాను కూడా వారితో మమేకమై వారి మధ్యనే అల్పాహారం తిన్నారు.. ఆహారం నాణ్యత, రుచి అద్భుతంగా ఉన్నాయని కితాబు ఇచ్చారు.. ఎంతో మంది జనం వచ్చే అన్న క్యాంటిన్ పరిసరాల్లోను ఎల్లప్పుడూ పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని సూచించారు.. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యే అయ్యాక తొలి ప్రారంభోత్సవం అన్న క్యాంటీన్ కావడం నా అదృష్టమని, నాజన్మ ధన్యం అయినదని అన్నారు.. అన్న క్యాంటిన్ పేదల సొత్తు అని, ప్రతి రోజూ 700 మందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం 700 మందికి భోజనం, రాత్రి 700 మందికి భోజనం అందించడం జరుగుతుందని తెలిపారు.. పేదల ఆకలి తీర్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం గతంలోనే అన్న క్యాంటిన్ లు ఏర్పాటు చేస్తే, పట్టెడన్నం పెట్టలేని గత వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా మూసివేసిందని తెలిపారు.. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు తొలి ఐదు సంతకాల్లో అన్న క్యాంటిన్ ను కూడా చేర్చి చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని తెలిపారు.. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీవో వికె శీనా నాయక్, డిఎస్పీ వెంకట రమణ, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, సాయి రామ్, టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, జ్యోతి బాబురావు, పోతుగంటి అలేఖ్య, బీజేపీ పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం, జనసేన పట్టణ అధ్యక్షులు పోబ్బా సాయి విఠల్, పెద్ద ఎత్తున టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..