ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం కావలి చరిత్ర లో శాశ్వతంగా నిలిచిపోతుంది.
కూల్చివేతకు గురైన చోటునే జాతీయభావం, స్ఫూర్తి నింపే నిర్మాణాలకు కావ్య శ్రీకారం చుట్టడం అభినందనీయం
- బీద రవిచంద్ర యాదవ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.
78 వ స్వాతంత్రదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కావలి పట్టణంలో స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి నేతృత్వంలో వారి సొంత ఖర్చులతో 100 అడుగుల జాతీయ జెండా ఐకానిక్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ను ఆవిష్కరించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్... ఈ సందర్భంగా బీద మాట్లాడుతూ.......
1915 నుండి 1946 వరకు జాతి పిత మహాత్మా గాంధీ మూడు దఫాలు (కావలి, అల్లూరు, బిట్రగుంట) లో అడుగుపెట్టిన చారిత్రక గడ్డ...అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన చారిత్రక నేల కావలి.
దేశ స్థాయిలో విద్యారంగ ప్రస్తావన వచ్చినప్పుడు వినిపించే పేరు కావలి. ఇక్కడి విద్యా సంస్థల ప్రస్తావన వచ్చినప్పుడు తొలిగా గుర్తు వచ్చే సంస్థ "విశ్వోదయ".
కావలి నియోజకవర్గ శాసనసభ్యులు గా గతంలో పని చేసిన ఏ ఒక్కరికి సాధ్యం కాని ఘనత నేటి శాసనసభ్యులు
కావ్య కృష్ణారెడ్డి కి దక్కింది.
ఐ లవ్ కావలి పేరుతో సెల్ఫీ ఐకానిక్ పాయింట్ ,కావలి కి ప్రాతినిధ్యం వహించిన మహనీయుల, కావలి ప్రతిష్ఠ ను ఇనుమడింపచేసిన గొప్ప వ్యక్తుల చిత్రాలతో రూపొందిన ఐకానిక్ వేదిక భావి తరాలకు స్మరణీయం.
దేశ స్వాతంత్ర్యం కై శ్రమించిన సమరయోధులు, జాతి నిర్మాణం కొరకు తపించిన మహనీయులు, నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుల చిత్రాలతో (బత్తిన రామకృష్ణా రెడ్డి మొదలుకొని కావ్య కృష్ణా రెడ్డి వరకు) నిండిన పైలాన్ స్వాతంత్ర స్ఫూర్తి నింపుతోంది.
స్వాతంత్ర చరిత్ర పాఠ్య పుస్తకాలలో చదువుకోవడమే కాక భావి తరాలకు పరిచయం చేయాల్సిన బాధ్యత , అవసరం ఉందని కావ్య కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు తలచి పైలాన్ నిర్మాణానికి కృషి చేశారు.
సినీ రంగంలో ప్రతి నాయకుడు గా మన్ననలు పొందిన రాజనాల మొదలుకొని రామచంద్రారెడ్డి వరకు అందరి చిత్రాలను పైలాన్ ద్వారా భావి తరాలకు పరిచయం చేస్తున్న కావ్య కుటుంబ సభ్యులను అభినందిస్తున్నాను.
కావలి నియోజకవర్గం అభివృద్ధి కోసం శాసనసభ్యులు గా తపన పడుతున్న తండ్రి ఆశయసాధనకు వారి పిల్లలు తోడ్పాటు అందించటం, పైలాన్ నిర్మాణం లో పాలుపంచుకోవడం అభినందనీయం.
దేశ స్వాతంత్రం కోసం శ్రమించిన సమర యోధులను చిత్రాల రూపంలో పైలాన్ ద్వారా గుర్తు చేస్తున్న ఎమ్మెల్యే కావ్య పిల్లలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
5 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో కూల్చివేతలతో పాలన మొదలైంది. ఇదే చోటున నేడు జాతి నిర్మాణం, స్వాతంత్ర పోరాటాలను గుర్తు చేస్తూ జాతీయ భావం పెంపొందించేందుకు తలపెట్టిన బృహత్తర కార్యక్రమం మొదలైంది.
స్వాతంత్ర స్ఫూర్తి పెంపొందించే ఇటువంటి గొప్ప కార్యక్రమాలు రాష్ట్ర మంతటా తలపెట్టేలా, ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడి గారి దృష్టికి తీసుకువెళ్తాం.
భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహకారం తో కావ్య కృష్ణారెడ్డి నేతృత్వంలో రానున్న 4 ఏళ్లలో కావలి నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.