మన గ్రామాల అభివృద్ధి మన చేతుల్లోనే - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
మన గ్రామాల అభివృద్ధి ఇప్పుడు మన చేతుల్లోనే ఉందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు.. శుక్రవారం అల్లూరు మండలం నార్త్ ఆములూరు, బోగోలు మండలం జువ్వలదిన్నె, కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో నిర్వహించిన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో నమోదు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల వేతన ఉపాధి చూపించబడునని, గ్రామంలోని ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు అందేలా చూస్తామని తెలిపారు.. పని కోరిన 15 రోజుల్లోనే పని పొందే హక్కు కల్పిస్తున్నామని, అని కోరిన 15 రోజుల్లోపు పని కల్పించనట్లయితే పని కోరిన తేదీ నుంచి నిరుద్యోగ భృతి పొందే హక్కు కల్పిస్తున్నామని తెలిపారు.. గ్రామంలో ఉన్న సమస్యలను, గ్రామస్తుల అభిప్రాయాలను తీసుకొని, గ్రామస్తుల భాగస్వామ్యంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని, వీటిని ఈ గ్రామ సభలో ఆమోదించబోతున్నామని తెలిపారు.. ప్రతి ఒక్క పనిని పరిగణన లోకి తీసుకోవటం జరుగుతుందని తెలిపారు.. వ్యవసాయ అనుబంధ పనులు, నీటి సంరక్షణ పనులు మౌలిక సదుపాయాల కల్పన పనులు వ్యక్తిగత లబ్ధినిచ్చే పనులు ఇలా నాలుగు రకాలుగా పనులను విభజించడం జరిగిందని తెలిపారు.. స్వర్ణ గ్రామపంచాయతీ అమలులో భాగంగా గ్రామసభలను నిర్వహించుకుంటున్నామని గృహ అవసరాల కల్పనలో భాగంగా విద్యుత్ కనెక్షన్, కుళాయి ఏర్పాటు, మరుగుదొడ్డి సదుపాయం, ఎల్ పిజి గ్యాస్ సదుపాయాలను గ్రామపంచాయతీలోని అన్ని కుటుంబాలకు అందించబోతున్నామన్నారు.. సాధారణ సదుపాయాల మెరుగుదల లో భాగంగా నీటి సరఫరా పథకం, డ్రైనేజీ సదుపాయం, ద్రవ్య వ్యర్ధాల నిర్వహణ, వీధి దీపాలు, సిమెంటు రోడ్లు, ఘన వ్యర్ధాల నిర్వహణ వంటి సేవలను అందించబోతున్నామన్నారు.. మెరుగైన అనుసంధాన రోడ్లలో భాగంగా ప్రతి గ్రామం నుంచి మార్కెట్, పట్టణాలకు వెళ్లేందుకు గ్రామ పంచాయతీ నుండి లింక్ రోడ్లు నిర్మించబోతున్నామన్నారు.. స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా సుస్థిర గ్రామీణ జీవన పరిస్థితులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.. నీటి సంరక్షణ పనులు, పండ్లతోటలు, మల్బరీ తోటలను అభివృద్ధి పరచబోతున్నామని, అలాగే పశువుల షెడ్లు నిర్మించబోతున్నామని తెలిపారు.. సంవత్సరం రోజులకు సంబందించి ప్రజల నుండి వినతులు తీసుకొని పనులు పూర్తి చేసే విధంగా మహాత్తర ప్రణాళిక రూపొందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఎమ్మెల్యే గారు ధన్యవాదములు తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఎపిడి మృధుల, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడివోలు, ఏపివో లు, సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..