కోల్ కతాలోని ఆర్.జి.కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు తెలిపారు.. కావలి పట్టణంలోని బ్రిడ్జి సెంటర్ లో ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు చేపట్టిన నిరసన దీక్షలో ఎమ్మెల్యే గారు పాల్గొని సంఘీభావం తెలిపారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కోల్ కతా ఘటన సభ్యసమాజం తలదించుకునే దురదృష్టకర ఘటన అని అన్నారు.. మహిళా వైద్యురాలపై హత్యా చారం అమానూషం అన్నారు. వైద్య విద్యలో వచ్చే నూతన విధానాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ప్రాణాలను బ్రతికించడానికి చివరి వరకు పోరాడే యోధులు డాక్టర్లు అని తెలిపారు.. వైద్యుల ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే చర్యలు మంచిది కాదని తెలిపారు.. హత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు..