కావలి లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు - ముఖ్య అతిధిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య
కావలి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ లో, జనసేన కావలి నియోజకవర్గ ఇంచార్జి అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.. భారీ కేక్ ను కట్ చేసి అభిమానులకు, నాయకులకు పంచిపెట్టారు..రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన అభిమానులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. వైసీపీ రాక్షస పాలన అంతమొందించడానికి పవన్ చేసిన పోరాటం వృధా కాలేదన్నారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ప్రజలకు అండగా ఉంటానని ముందుకు వచ్చి ప్రజల్లో ధైర్యం నింపిన వ్యక్తి పవన్ అని తెలిపారు.. ఓర్పు, క్రమశిక్షణ, అంకిత భావం పవన్ కున్న లక్షణాలని, అవే నేడు అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్ళాయని తెలిపారు.. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో జనసైనికులు నడవాలని, ఆయన చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. వచ్చే పవన్ జన్మదినం నాటికి గ్రూపులు వీడి అందరూ సమిష్టిగా ఉంటూ ఒకే నాయకత్వంలో జన్మదిన వేడుకలు నిర్వహించాలని కోరారు.. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నానని, అభివృద్ధి ప్రధాత చంద్రబాబుతో కలిసి రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి సమ్మను వెంకట సుబ్బయ్య, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఆలా శ్రీనాద్, రిషికేష్, తిరుమలశెట్టి సుధీర్, టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, జ్యోతి బాబురావు, మలిశెట్టి వెంకటేశ్వర్లు, పోతుగంటి అలేఖ్య, పోతుగంటి శ్రీకాంత్, పద్మావతి శ్రీదేవి, అక్కిలగుంట సూర్య ప్రకాష్, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..