ఆర్డీవో కార్యాలయంలో ఘనంగా 78 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఆర్డీవో కార్యాలయంలో ఘనంగా 78 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 

కావలి ఆర్డీవో కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ముఖ్య అతిధిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. గౌరవ వందనం స్వీకరించారు.. ఆర్డీవో వికె శీనా నాయక్ డివిజన్ లోని ప్రగతిని తెలియజేశారు.. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ భారతదేశ విశిష్టతను ప్రతి ఒక్కరూ నెమరువేసుకోవాలని తెలిపారు.. జెండాలోని రంగుల విశిష్టత, అశోక చక్రం ప్రాధాన్యత లను వివరించారు.. ప్రపంచ దేశాలకు మనం మార్గదర్శకంగా మారామని, కరోనా సమయంలో వ్యాక్సిన్ కనిపెట్టింది మన భారతీయులేనని తెలిపారు.. దేశంలోనే ఉంటూ మన విజ్ఞానాన్ని మన భరత జాతికి అందిస్తూ మాతృదేశ రుణం తీర్చుకోవాలని అన్నారు.. ఉత్తమ సేవలు అందించిన పలువురికి ఎమ్మెల్యే గారు ప్రశంసా పత్రాలు అందజేశారు.. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీవో వికె శీనానాయక్, డిఎస్పీ వెంకట రమణ, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు..

google+

linkedin