ఘనంగా జరిగిన సేవియర్స్ 7వ ఆవిర్భావ దినోత్సవం.. ముఖ్యఅతిథిగా హాజరైన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు.

ఘనంగా జరిగిన సేవియర్స్ 7వ ఆవిర్భావ దినోత్సవం.. ముఖ్యఅతిథిగా హాజరైన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు.

గత ఏడు సంవత్సరాల గా కావలి పట్టణం మరియు పరిసర ప్రాంతాలలో వివిధ సామాజిక సేవలు చేస్తున్న సేవియర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఏడవ ఆవిర్భావ దినోత్సవం ఆగస్టు 15వ తారీఖున టీచర్స్ కాలనీలోని పులిమిరెడ్డి ఫంక్షన్ హాల్ నందు అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడుతూ సేవియర్స్ లో ఉండే యువతకు బయట ఉండే యువతకి చాలా తేడా ఉందని, ఈ వయసులోనే సమాజ సేవ చేయడం అత్యుత్తమని, అలానే సమాజ సేవతో పాటు చదువుని నిర్లక్ష్యం చేయకుండా కెరియర్ మీద కూడా దృష్టి సారించాలని, అలానే ఏదైతే ప్రస్తుతం సామాజిక సేవ చేస్తున్నారో అది కూడా చివరి వరకు కొనసాగించాలని ఆయన తెలిపారు.


google+

linkedin