గణపతి ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే
అల్లూరులోని పేటలో పోలేరమ్మ ఆలయం వద్ద ఏర్పాటుచేసిన గణపతి స్వామిని మంగళవారం కావలి నియోజకవర్గం శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి గారు దర్శించుకున్నారు. ఇందులో భాగంగా ముందుగా గ్రామ దేవత పోలేరమ్మను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.అమ్మవారి పల్లకి సేవలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం నిమజ్జనం లో భాగంగా ప్రత్యేక పూలతో అలంకరించారు.
ఈ సందర్భంగా గణపతిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఆయన మాట్లాడుతూ యువకులు గ్రామ పెద్దలతో కలిసి హిందూ సంప్రదాయాలను పద్ధతులను ఎంతో గౌరవిస్తూ ఇలాంటి ఉత్సవాలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.భాగంగా తమ అత్తగారు గ్రామమైన అల్లూరులో కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఏ పూజ్యులైన మొదట పూజ అందుకొండే అజ్జ గణపయ్య రైతులను గ్రామస్తులను ఎంతో చల్లగా చూడాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు బీద గిరిధర్ గ్రామ పెద్దలు మేడా రామకృష్ణారెడ్డి, మేడా రమణారెడ్డి,మేడా శ్రీనివాసులు రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఉత్సవ కమిటీ యువకులు భక్తులు పాల్గొన్నారు.