అల్లూరు ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్దాం..... కార్యకర్తలతో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు...
అల్లూరులో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు మంగళవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అన్ని పంచాయతీల కార్యకర్తలు చిన్న స్థాయి నాయకులతో పలు సమస్యలపై చర్చించారు.ఇందులో భాగంగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మండల స్థాయి గ్రామస్థాయి అధికారులతో అందుబాటులో ఉంటూ గ్రామాల్లోని సమస్యలపై చర్చించాలన్నారు.గత ప్రభుత్వంలో ప్రజలకు ఏ అభివృద్ధి జరిగినా దాఖలు లేవని కనుక తెలుగుదేశం కార్యకర్తలు గ్రామాల్లోని సమస్యలను తమ దృష్టికి తీసుకొని వచ్చి అధికారులతో పరిష్కరించే కృషి చేయాలన్నారు. ఎక్కువగా గిరిజనుల నివసిస్తున్న అల్లూరు మండలాన్ని నగర పంచాయతీగా మార్చి గత ఎమ్మెల్యే పేద ప్రజల కు అన్యాయం చేశారన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన వెంటనే అల్లూరు నగర పంచాయతీని పంచాయతీగా మార్చే పనుల్లోనే పూర్తిగా ఉన్నామని అతి తొందరలోనే పంచాయతీగా మారుస్తామన్నారు. అంతేకాక అల్లూరు మండల ప్రజలు మంచినీటితో నిత్యం అన్నాడుతున్నారని వారి సమస్య తీర్చేందుకు ప్రత్యేక నిధులను కూడా మంజూరు చేస్తున్నమని త్వరలో పనులు మొదలు పెడతామన్నారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ద్వారా ప్రతి గ్రామానికి మంచినీటిని సరఫరా చేసి సురక్షితమైన నీటిని ప్రజలకు అందిస్తామన్నారు. అలాగే గ్రామాల్లోని ప్రజలు వారి సమస్యలను వినతి పత్రిక రూపంలో ఎమ్మెల్యేకి అందజేసి విన్నవించుకున్నారు.
కొన్ని సమస్యలను అక్కడినుండి అధికారులతో మాట్లాడి తొందరగా పరిష్కరించాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా రాజుపాలెం నుండి ఇసుకపల్లి కి వెళ్లే ప్రధాన రహదారి సక్రమంగా లేకపోవడంతో వాహనదారులు నాన్న అవస్థలు పడుతున్నారని శంకుస్థాపన చేసి తందర్ల పనులు మొదలు పెడతామన్నారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకోక ముందే ప్రజా సమస్యలపై ప్రతి మండలం తిరుగుతూ తెలుసుకుంటున్నామని ఇంకా ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని ఒక్కొక్కటి పరిష్కరిస్తామన్నారు. ఏ గ్రామాల్లో ఏ సమస్య ఉన్న స్థానిక నాయకులు బీద గిరిధర్ కు, నా దగ్గరకు తీసుకురావాలని కార్యకర్తలను కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు బండి అమర్ రెడ్డి, నెల్లూరు నిరంజన్ రెడ్డి, కృష్ణ చైతన్య, అరగల రమణయ్య, మాజీ ప్రిన్సిపాల్ మేడా రామకృష్ణారెడ్డి, మేడా శ్రీనివాసులు రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు...