గణపయ్య ను దర్శించుకున్న కావలి ఎమ్మెల్యే

 గణపయ్య ను దర్శించుకున్న కావలి ఎమ్మెల్యే 

దగదర్తి మండలం ఉలవపాళ్ళ గ్రామంలో జరిగిన వినాయక చవితి వేడుకల కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు శనివారం రాత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్యే కు ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే  తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.. 

కావలి నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే గారు వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నో చోట్ల వినాయకులను దర్శించుకోవడం జరిగిందని, కానీ వినాయకుని గుడిలో ఏర్పాటు చేసిన గణపతిని దర్శించుకోవడం ఇదే మొదటి సారని తెలిపారు.

వినాయకుడికి గుడిని ఏర్పాటు చేసుకొని సర్వ విజ్ఞాలు గ్రామస్తులు తొలగించుకోవడం అభినందనీయం అని అన్నారు. దగదర్తి మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాబోతుందని, యువతకు భారీగా ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించిన గ్రామస్తులకు ధన్యవాదములు తెలుపుతున్నానన్నారు.

ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని, కాపు కాస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు బత్తల వెంకట తేజ, మామిడాల కొండయ్య, తెలుగుదేశం నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, జనసేన కావలి ఇంచార్జి అలహారి సుధాకర్, దగదర్తి మండల అధ్యక్షులు అల్లం హనుమంతరావు, స్థానిక నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, పొట్టేళ్ల శ్రీనివాసులు, కప్పల సుబ్బయ్య, సూరి వెంకటేశ్వర్లు, కప్పల మనోజ్, తదితరులు పాల్గొన్నారు..


google+

linkedin