అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చంద్రబాబు పాలన
- ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
- ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి అన్నారు. కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం చెన్నూరు మేజర్ పంచాయతీలో శనివారం రెండవ రోజు "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో జరిగిన 100 రోజుల పాలన వివరిస్తూ ఎమ్మెల్యే కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే కు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందన్నారు. 100 రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు అందజేసి ప్రజల చేత "ఇది మంచి ప్రభుత్వం" అని అనిపించుకుంటుందన్నారు. అవ్వ తాతల పెన్షన్ 4000, వికలాంగుల పెన్షన్ 6000 చేయడం జరిగిందన్నారు. లక్షలాదిమంది పేదల ఆకలి తీర్చే "అన్న క్యాంటీన్లు", యువత భవిష్యత్తుకు "మెగాడీఎస్సీ" ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని ప్రజల కోసమే పని చేస్తున్నాయని తెలిపారు. మండలంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానన్నారు. రైతుల కష్టాలు తెలిసిన రైతు బిడ్డను అని, అందుకే డిఆర్ ఛానెల్, డిఎం ఛానెల్ ద్వారా పొలాలకు సాగు నీరు అందిస్తానన్నారు. దగదర్తి - బుచ్చి రోడ్డును త్వరగా పూర్తి చేయిస్తానన్నారు. చెరువుల ఆక్రమణలను తొలగిస్తామని, అన్యాక్రాంతం కాకుండా చూస్తానన్నారు. దామవరం ఎయిర్ పోర్టు కట్టడం కోసం, భూసేకరణ నిమిత్తం 100 రోజుల్లోనే రూ.96 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందన్నారు. దగదర్తి లో త్వరలో అన్న క్యాంటిన్ రాబోతుందన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఎంపిడివో శ్రీదేవి, దగదర్తి మండల టీడీపీ అధ్యక్షులు అల్లం హనుమంతరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, కండ్లగుంట మధుబాబు నాయుడు, జలదంకి శ్రీహరి నాయుడు, చెన్నూరు సర్పంచ్ నాయక్, పాపన మల్లికార్జున రెడ్డి, జనసేన నాయకులు వెంకట్ యాదవ్, అధికారులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.