అభివృద్ధికి మణిహారంలా...సామాన్యుడిని ఆర్ధిక శక్తికి ఆలంబనగా దగదర్తిని తీర్చి దిద్దుతా...ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
భారీగా తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు, మండల ప్రజల నడుమ దగదర్తి-బుచ్చి రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
ఎన్నికల వరకే రాజకీయాలు, ఇక మళ్ళీ ఎన్నికల వరకు అభివృద్ధి సాధన, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా 24/7 అలుపెరగక పని చేస్తా, ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉంటా
సమాజ సమగ్ర అభివృద్ధికి రహదారులు, మంచినీరు, సాగునీరు, నాణ్యమైన విద్యుత్ తప్పనిసరి, ప్రభుత్వ పెద్దలు, మంత్రులను ఒప్పించి, మెప్పించి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా
వ్యవసాయ సాగుకు ఎరువులు, ఉపకరణాల తరలింపు, పంటలు సకాలంలో విపణికి తరలించేందుకు డొంక రోడ్లు, లింక్ రోడ్లు అవసరం. ఎన్ని ప్రతిపాదనలు వచ్చినా ఎన్ ఆర్ ఇ జి ఎస్ ద్వారా నెరవేర్చేందుకు కృషి చేస్తా
దామవరం విమానాశ్రయ నిర్మాణానికి సీఎం చంద్రబాబు గారు కృతనిశ్చయంతో వున్నారు, త్వరలోనే నిర్మాణం మొదలు
ప్రధాన సాగునీటి కాలువల అభివృద్ధి, విస్తరణకు నిధులు సాధించి కార్య రూపంలోకి తెస్తా
దగదర్తి మండల కేంద్రంలో కార్యకర్తలకి అందుబాటులో పార్టీ కార్యాలయం ప్రారంభించి 24/7 సేవలు అందుబాటులో ఉండేలా చూస్తా
రామాయపట్నం పోర్టు ప్రాంతంలో దాదాపు ఐదు వేల ఎకరాలలో పరిశ్రమలు ఏర్పాటు ద్వారా ఒక్క కావలి నియోజకవర్గ యువతకే 40 వేల మందికి ఉద్యోగ కల్పన
కావలి నియోజకవర్గ భూమాతను వ్యవసాయ, పారిశ్రామికంగా సస్యశ్యామలం చేసేందుకు, ఆర్ధిక విప్లవానికి నాంది పలికేందుకు పైన దేవుడు లాగా సీఎం చంద్రబాబు గారు వున్నారు, అతి త్వరలోనే నియోజకవర్గ ముఖచిత్రం సువర్ణ శోభితం కానుందన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి
ఎమ్మెల్యే ప్రసంగానికి అడుగడుగునా కేరింతలతో హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన ప్రజానీకం