బాధితుల హృదయ వేదన అర్ధం చేసుకుంటూ....ఇబ్బందులు తెలుసుకుంటూ....ఊరడిస్తూ....సహాయ కార్యక్రమాలపై ఆరా తీస్తూ...తక్షణ ఉపశమన చర్యలపై బాధితుల నుంచి సూచనలు స్వీకరిస్తూ...స్థానిక నాయకులు , అధికారులతో కలిసి బెజవాడ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్న నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు
ఎక్కడ కావలి... ఎక్కడ విజయవాడ...విపత్తు గురించి తెలిసిన వెంటనే హుటాహుటిన తరలి వెళ్లి ఒక శాసన సభ్యునిగా మానవీయ కోణంలో సేవలందిస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు
బాధిత ప్రజలతో మమేకమై సమస్యల లోతుల్లోకి వెళ్లి నిల్వ ఉన్న వరద నీటి తొలగింపుకు ఉన్న అవకాశాలు, వైద్య సహాయాలపైన స్థానిక అధికారులకు సూచనలిస్తూ పరిష్కారాలపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే
ముంపు శాశ్వత పరిష్కారాలపై స్థానికుల అభ్యర్ధనలను సి.ఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని హామీ
ఏడు దశాబ్దాల చరిత్రలో మునుపెన్నడూ కృష్ణమ్మ ఇంతటి ఉగ్రరూపాన్ని చూడలేదంటూ బాధితుల వెల్లడి
ఇంతటి విపత్కర స్థితిలోనూ ప్రభుత్వ సహాయక చర్యలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న స్థానికులు