ఎమ్మెల్యే పేరుతో వినాయక చవితికి చందాలు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదు
- ప్రజల ఇబ్బందులు తొలగించడానికి ఎల్లప్పుడూ నేను సిద్ధం
- కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు వెల్లడి
నా పేరు చెప్పి వినాయక చవితికి చందాలు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని, అలాంటి విషయాలను నా దృష్టికి తీసుకురావాలని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కోరారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాలు తీర్చే వాడు వినాయకుడని, కావలి ప్రజల ఇబ్బందులు తొలగించేది నేనని ఎమ్మెల్యే తెలిపారు. వినాయకచవితి ని ఎమ్మెల్యే ఘనంగా చెయ్యమన్నారు, ప్రతిష్టాత్మకంగా చెయ్యమన్నారు అంటూ ఎవరైనా మీ ముందుకు చందాలకు వస్తే నాకు పిర్యాదు చెయ్యాలని తెలిపారు.. కావలి ప్రశాంతంగా ఉండాలి, విజ్ఞాలు లేకుండా ఉండాలని కోరుకుంటాను తప్ప, ఏ ఒక్క చందాదారుడను నేను ప్రోత్సాహించనని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు.. నా పేరు చెప్పి చందాలు దండే వారిని అరికట్టండని కావలి నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే గారు కోరారు..