పలువురు టిడిపి నాయకుల కుటుంబాలను పరామర్శించినఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు..

పలువురు టిడిపి నాయకుల కుటుంబాలను పరామర్శించినఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు..

కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు అనారోగ్యంతో  బాధపడుతున్న  మేదరమెట్ల ఈశ్వర్ రెడ్డిని గురువారం ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు..టిడిపి నాయకులు ఈశ్వర్ రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఇటీవల అనారోగ్యంతో నెల్లూరు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకొని ప్రస్తుతం ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను పరామర్శించి త్వరగా కోలుకోవాలని కోరారు..అనంతరం గౌరవరం గ్రామంలో టిడిపి సీనియర్ నాయకులు ఇండ్ల సూర్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందటంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు సూర్యనారాయణ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు పమిడి రవికుమార్ చౌదరి,గౌరవరం టిడిపి నాయకులు చింతం బాబుల్  రెడ్డి,సురే శ్రీనివాసులు రెడ్డి,సురే హరిచంద్ర రెడ్డి,గోసాల శ్రీనివాసులు రెడ్డి,అశోక్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు..






google+

linkedin