కావలి మండలం గౌరవరం గ్రామానికి చెందిన లబ్ధిదారుడు షేక్ మస్తాన్ భాష కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును టిడిపి కార్యాలయంలో మంగళవారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు అందజేశారు. అనారోగ్యాల పాలై ఆసుపత్రిలో ఖర్చులు పెట్టిన డబ్బులు ఎమ్మెల్యే సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు లబ్ధిదారుడు భాష ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.ఈ చెక్కు పంపిణీ కార్యక్రమంలో గౌరవరం టిడిపి నాయకులు చింతం బాబుల్ రెడ్డి, సూరే శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు..