శభాష్ ఎమ్మెల్యే..
ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు ముందస్తుగా చేపట్టిన చర్యలు ఈరోజు శభాష్ ఎమ్మెల్యే అనేలా చేస్తున్నాయి..
కావలి ట్రంక్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న డ్రైనేజ్ దశాబ్దాలుగా పూడికతీతలు తీయకపోవడంతో తేలికపాటి వర్షాలకే ప్రధాన రహదారి జలమయమయేది.. రహదారి పై నీరు తొలగేందుకు కనీసం రెండు మూడు గంటలు సమయం పట్టేది..
రానున్న వర్షాకాలం రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థను ముందుగా అంచనా వేసిన ఎమ్మెల్యే కావ్య కొద్దిరోజుల క్రితం ట్రంక్ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజ్ 40 వార్డులలో డ్రైనేజీలు రోడ్డుకు ఇరువైపులా కంపచెట్ల తొలగింపు ఇప్పుడు ఫలితాలను ఇస్తుంది..
రెండు రోజుల నుండి భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ట్రంక్ రోడ్డుపై 15 నిమిషాల కాలవ్యవధిలో నీరు నిల్వ ఉండకుండా శుభ్రం అవుతున్న పరిస్థితి..
ఒకప్పుడు వర్షం పడితే ముసునూరు రోడ్లులో వెళ్లాలంటే భయపడే ప్రజలు.. ఎమ్మెల్యే సొంత నిధులతో ముసునూరు రోడ్డును మరమ్మతులు చేపట్టారు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందు లేకుండా ప్రయాణం చేస్తున్నారు..
లేవుట్లలో పంట కాలువలు వరద కాలువలు ఆక్రమణలు తొలగించడంతో.. పట్టణంలో పడ్డ వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు దిగువకు దిగువకు వెళ్ళిపోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..